ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఆమె చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ..
“దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను.” అని రాసుకొచ్చారు.
Also Read: కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్ లో వెతికేవి ఇవేనట..!?
హీరాబెన్ మోదీ గాంధీనగర్ సమీపంలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసించేవారు. ప్రధాని తన పర్యటనలతో ఎంత బిజీగా ఉన్నా.. వీలు చిక్కినప్పుడల్లా గుజరాత్ వెళ్లి తల్లిని కలుసుకునేవారు. మరికాసేపట్లో గాంధీనగర్‌లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో అమ్మ పక్కనే కూర్చున్నారు. సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించనున్నారు.
