వచ్చే ఏడాది జరిగే తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో తాను పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్తకు తలైవా రజనీకాంత్ గురువారం ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. వార్తలో పేర్కొన్నట్టు తన ఆరోగ్యం గురించి వైద్యులతో సంప్రదించిన మాట వాస్తవమేనని, రాజకీయ ప్రవేశం విషయం లో వాస్తవం లేదని, సరైన సమయంలో తన నిర్ణయాన్ని తెలియజేస్తానని తెలిపారు.
నాకు 2011 లో కిడ్నీ సమస్య తలెత్తడంతో చికిత్స చేయించుకున్నాను,కానీ 2016 లో మళ్లీ అదే సమస్య తలెత్తడంతో కిడ్నీ మార్పిడి జరిగిందని రజిని తెలిపారు. ప్రస్తుతం 70 ఏట అడుగుపెట్టాను, ఈ వయసులో వయోభారం, మూత్రపిండ మార్పిడి చికిత్స కారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, ఈ సమయంలో కరోనా సోకితే ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అందువలన తన రాజకీయ రంగ ప్రవేశం నిర్ణయాన్ని ఆలోచించి తెలియజేస్తానని ఆయన ప్రకటించారు.
కోట్లాది అభిమానులు దైవంగా భావించే రజినీకాంత్ ఈ నెల లోనే పార్టీ ప్రకటన చేయాల్సి ఉంది. కరోనా కారణంగా అది ఆచరణలోకి రాలేదు. వచ్చే ఎన్నికల్లో రజినీ పార్టీ మక్కల్ మండ్రం పోటీపై ఆచితూచి స్పందిస్తున్న రజిని ఒకవేళ పార్టీ ప్రారంభించాలి అనుకుంటే ఈ డిసెంబర్ లో ప్రారంభించాలి.
కనుక రజిని ఇక పార్టీ ప్రకటన విరమించుకున్నట్లే అని భావించక తప్పదు . కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు ఆయన సినిమాలు కూడా చేయక పోవచ్చు. మరి ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.