Pooja Hegde: ఒక స్పెషల్ సాంగ్‌కి రూ. 5 కోట్లు.. స్టార్ ఇమేజ్ తగ్గని పూజా హెగ్డే
Pooja Hegde: తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్ల పాటు అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఫ్లాప్‌ల కారణంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆమె స్టార్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని తాజాగా రుజువైంది. తన అద్భుతమైన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్‌తో అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న పూజా.. ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
కొన్ని భారీ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో లీడ్ రోల్స్ సంఖ్య తగ్గినప్పటికీ, పూజా హెగ్డే వెనకడుగు వేయలేదు. హీరోయిన్‌గా కాకుండా, స్పెషల్ సాంగ్స్, ప్రత్యేక పాత్రల ద్వారా తన స్టార్ ప్రెజెన్స్‌ను కొనసాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కూలీ’ సినిమాలో ఆమె చేసిన ‘మౌనిక’ స్పెషల్ సాంగ్ దక్షిణాది అంతటా వైరల్‌గా మారి, ఆమెను మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చింది. ఈ పాటలో ఆమె డ్యాన్స్, గ్లామర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
‘మౌనిక’ పాట విజయవంతం కావడంతో పూజా హెగ్డేకు ప్రత్యేక గీతాల ఆఫర్లు వరస కడుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లోని ఒక ప్రత్యేక గీతం కోసం పూజా హెగ్డేను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేకు నిర్మాతలు ఏకంగా రూ. 5 కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ఐటమ్ సాంగ్‌కు ఇంత భారీ మొత్తం పారితోషికంగా ఇవ్వడం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అరుదైన విషయం. ఈ భారీ రెమ్యునరేషన్ డిమాండ్.. సినిమా అవకాశాలు కాస్త తగ్గినా కూడా పూజా హెగ్డే మార్కెట్ విలువ ఇంకా బలంగా ఉందని మరోసారి నిరూపించింది.
ప్రస్తుతం స్పెషల్ సాంగ్‌లపైనే తన దృష్టిని కేంద్రీకరించిన పూజా, త్వరలోనే తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుని మళ్లీ స్టార్ హీరోల సరసన లీడ్ హీరోయిన్‌గా కనిపించే అవకాశాలు బలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
