Pooja Hegde Negative Role : పూజ హెగ్డే కొంతకాలం వరకు తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. “ఒక లైలా కోసం” సినిమాతో మనకు పరిచయమైన ఈ అమ్మడు, ఆ తర్వాత మంచి సినిమాలు చేస్తూ పెద్ద హీరోల సరసన నటించింది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో ‘మోహెన్ జోడారో’ సినిమా కూడా చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో దువ్వాడ జగన్నాథం సినిమా చేసింది రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత.
ఈ సినిమా హిట్ తో ఇంకా ఈ అమ్మడికి దశ కలిసొచ్చినట్టే అయింది. నిన్న మొన్నటి వరకు కూడా పూజ హెగ్డే తెలుగు ఇండస్ట్రీని ఏలింది అనే చెప్పవచ్చు. కానీ ఈమధ్య అమ్మడి అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఒకవైపు శ్రీలీల ఎంట్రీతో ఈ పుట్టబొమ్మ స్థానం కనుమరుగు అయింది. చాలామంది మూవీ మేకర్స్ శ్రీలీలకే మొదటి ప్లేస్ ఇవ్వడంతో పూజ హెగ్డే ఉన్నట్టుగా మాయమైపోయింది.
అయితే ఈమెకు ఛాన్స్ లు దక్కకపోవడానికి రెమ్యునరేషన్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. చిన్న సినిమాకి నాలుగు కోట్లు, అలాగే పెద్ద సినిమాలైతే ఏకంగా ఏడు కోట్ల రెమ్యునరేషన్ అడగడంతో ప్రొడ్యూసర్స్ ఈమని పక్కకు పెట్టారు అనే విషయం సోషల్ మీడియాలో ఒక రూమర్ గా వచ్చింది. ఈ టైంలో పూజ హెగ్డే ఇప్పుడు గ్లామర్ రోల్స్ ని పక్కకు పెట్టి, ఎటువంటి పాత్రనైనా నటనకు స్కోప్ ఉండే పాత్రను చేయాలని డిసైడ్ అయినట్లు చెప్పింది.
అనుకున్నదే తడవుగా ఓటీపీ సంస్థకి ఒక వెబ్సైట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఆ పాత్ర పూర్తిగా చాలా నెగటివ్ షేడ్స్ తో, బోల్డ్ క్యారెక్టర్ గా ఉంటుందంట, అయినప్పటికీ పూజ ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంది. నెగటివ్ రోల్ లో పూజ చేయడం ఇదే మొదటిసారి. పూజ ఓన్లీ అందాల ఆరబోతతో తప్ప తనకు నటన రాదంటూ ఇండస్ట్రీలో ఆమెకు ఒక పేరు కూడా ఉంది.
దాన్నుంచి బయటపడడానికే నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇకమీదట ఎన్నుకుంటానని పూజ చెప్తుండడం విశేషం. కానీ అందరూ కూడా అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు నెగిటివ్ రోల్స్ కూడా చేయడానికి ఒప్పేసుకుంటుందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.