Pooja Hegde : పూజ హెగ్డే సినీ పరిశ్రమలో చాలా తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన యంగ్ హీరోల సరసన నటించి చాలా పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో అమ్మడికి సినిమాల అవకాశాలు తగ్గినప్పటికీ, తన హవా మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఈ మధ్య షాప్ ఓపెనింగ్ కి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ దీనికి కారణం.
కడపలో ఒక దుకాణం ప్రారంభోత్సవం కొరకు పూజ హెగ్డే కొన్ని గంటలు అక్కడ గడపవలసి ఉంది. అయితే ఆ కొన్ని గంటలకు పూజ హెగ్డే తీసుకున్న రెమ్యునరేషన్ చూస్తే చుక్కలు కనిపించాల్సిందే.. ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ మామూలుగా లేదు. అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
హిట్టును తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత చేసినటువంటి ఆచార్య, రాదేశ్యామ్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఇక మంచి కథ వస్తే సినిమా చేస్తాను అని తను చెప్తున్నప్పటికీ, డైరెక్టర్లు ఆమెను సినిమాలలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు అనేది మాత్రం వాస్తవం.
శ్రావణ శుక్రవారం రోజు కడపలో ఒక షాపు ప్రారంభోత్సవానికి వెళ్ళింది. పూజా హెగ్డే అక్కడ కొన్ని గంటలు మాత్రమే గడిపింది. తనకు చీరలు అంటే ఎంత ఇష్టమో తెలిపింది. చీర కట్టుకొని అచ్చంగా తెలుగు అమ్మాయిలాగా షాపు ప్రారంభోత్సవానికి హాజరైంది పూజా హెగ్డే. అయితే తాను గడిపిన ఆ కొన్ని గంటలకు తాను అక్షరాల 40 లక్షలు తీసుకుంది. అంటే తను సినిమాల విషయంలో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో మనం ఊహించుకోవచ్చు.