దక్షిణాది అగ్ర కథానాయికల లిస్ట్ తీస్తే అందులో పూజాహెగ్డే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. గ్లామర్ పాత్రలతో యూత్ మతులు పోగొడుతున్న ఈ పొడుకు కాళ్ల సుందరికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. గతేడాది వరకు గోల్డెన్ లెగ్ అన్న వారే ఇప్పుడు ఐరెన్ లెగ్ అని ముద్ర వేస్తున్నారు. ‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తక్కువకాలంలోనే అగ్ర కథానాయకులతో జోడీ కట్టి దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా పారితోషికంలోనూ ఈ అమ్మడే టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఇదిలా ఉంటే పూజాకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి.
ప్రస్తుతం పూజా ఆశలన్ని ‘SSMB28’ పైనే ఉన్నాయి. మరీ త్రివిక్రమ్ ఈసారి పూజాకు బ్రేక్ ఇస్తాడో లేదో చూడాలి. దీనితో పాటుగా సల్మాన్ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే యాక్షన్ కామెడీ సినిమా చేస్తుంది.

ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే మరోసారి తన రొమాంటిక్ లుక్స్‌తో నెటిజన్ల కళ్లను తనవైపు తిప్పుకుంది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో గ్రీన్ కలర్ డ్రెస్‌లో పూజా కంటి అదరగొడుతోంది. సింగిల్ పూస్ డ్రెస్‌తో టాప్ కనిపించేలా ఫోజులిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.
Pooja Hegde Stunning Looks in Gold Color Dress
