Pooja Hegde : వెండి తెరపై మెరిసే బుట్టబొమ్మ సినీ వినీలాకాశంలో ఓ చందమామ ఒక లైలా లా తెలుగు తెరపై మెరిసిన “జిగేలు రాణి” పూల బోత్తికి ఓణీ చుడితే నీకు మల్లె ఉంటుందేమో? నీ కాటుక కళ్ళతో నటనకు కావలి కాస్తు ప్రదర్శిస్తావు వెండితెరపై మా ముందు ఎన్నో కళలు ఆందుకే. కాళ్ళని పట్టుకు వదలనన్నవి కుర్రకారు కళ్ళు “సామజవరగమనా” అంటూ నువ్వు నడిచి వస్తే మనసు మీద వయసుకున్న అదుపు తప్పుతుంది.
వెన్నెల వనంలో విరిసిన పించేమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా? మంజుల హాసనికి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి, గోరువెచ్చనైన ఊసులదిరాయి . సొంతమల్లె తెలుగుని ప్రపంచానికి చేరుకుంటే ప్రేక్షకుల ప్రాణమంత చెప్పలేని హాయీ . చీర గట్టుకొని మెరిసే బుట్టబొమ్మ సినీ వినీలాకాశంలో ఓ చందమామ, ఎం అందం మావ రాములో రాములా అంటూ జింక లెక్క దుంకుతుంటె మస్తుగుంది. అ కట్-ఔటూ హిమలలన సుమశయన అందాల తార పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది.
తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. ముంబై ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో పీజీ చేసిన పూజా.. భరతనాట్యంలో శిక్షణ పొందింది.2010లో విశ్వసుందరి పోటీల్లో ఇండియా నుంచి పాల్గొనేందుకు జరిగిన అందాల పోటీల్లో పూజా రెండో స్థానంలో నిలిచింది . క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ కు ఫ్యాన్. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం, జెన్నిఫర్ లోపెజ్ పాటలంటే ఎంతో ఇష్టం. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమాలు ఎంతో ఇష్టపడుతుంది.
హీరోయిన్‌గా పూజా ఫస్ట్ మూవీ ‘మూగముడి’ అనే తమిళ చిత్రం నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తర్వాత శ్రీకాంత్ అడ్డాల, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘ముకుందా’ సినిమాలో నటించింది. అనంతరం బాలీవుడ్‌లో హృతికో రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక తెలుగులో‘రంగస్థలం’ సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ సాధించింది. తాజాగా ప్రభాస్ హీరోగా చేసిన పాన్ ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’లో హీరోయిన్ గా చేసింది.
చిరంజీవి ‘ఆచార్య’లోనూ నటించి మెప్పించింది. పూజా హెగ్డే బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ కలిసి రాకపోవడంతే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం (డీజే ) సినిమాలో నటించింది. అక్కడి నుంచి పూజా హెగ్డే ఓ విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఆందాల అభినయ తార గా ఓ స్దాయికి చేరుకుంది. వరుసగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంది. అయితే తెలుగులో మంచి ప్రేక్షకాదరణ ఏర్పడిన తరువాత ఇతర భాషా చిత్రాల మీద ఫోకస్ పెట్టింది. అలా బాలీవుడ్, కోలీవుడ్‌లో దక్కించుకుంటోంది. అలా ఇప్పుడు తెలుగుకు దూరమై ఇతర భాషల్లో నటిస్తోంది. పూజా హెగ్డే హ్యాపిబర్త్ డే..