ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరిగింది. కార్యక్రమంలో కేవలం నలభై మంది నాయకులకి మాత్రమే ఆహ్వానం అందినట్టు చెబుతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వక్తలు బీజేపీ బలోపేతం పై రకరకాల సూచనలు చేశారు.
కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ ప్రసంగం కీలకంగా మారింది. బీజేపీ ఇక ముందు రాష్ట్రంలో ఏవిధంగా ముందుకు వెళుతుందో ఆయన చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ నిర్వీర్యం అయ్యిందని పొలిటికల్ వాక్యూమ్ ని క్లియర్ చెయ్యవలసిన బాధ్యత బీజేపీపై ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీ అంటే స్వచ్ఛంద సంస్థ కాదని దాన్ని ప్రజల ఆమోదంతో గెలుపు దిశగా పయనింపజేసి అంతిమంగా ప్రజలకు మేలు చేయడం లక్ష్యం కావాలన్నారు. ఆయన కామెంట్స్ చాలా లోతుగా ఆలోచించాని ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనుకా ఏదో పరమార్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
