Pawan Kalyan: ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్ మ్యాషప్ వీడియో.. మీరూ చూసేయండి
Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రూపొందించిన ఒక ప్రత్యేకమైన మ్యాషప్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ‘ఈశ్వరా.. పవనేశ్వరా..’ అనే శక్తిమంతమైన బండ్ల గణేష్ వాయిస్‌తో మొదలైన ఈ వీడియో పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. పవన్ అభిమానులకి ఈ వీడియో ఒక పండగలా మారింది.
ఈ వీడియోలో ఆయన సినీ జీవితంలోని కీలక ఘట్టాలు, పవర్‌ఫుల్ డైలాగులు, అలాగే రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న ఒడుదొడుకులను భావోద్వేగభరితంగా చూపించారు. ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి 2024లో సాధించిన అద్భుత విజయం వరకు ఆయన చేసిన పోరాటాన్ని, ఆశయం కోసం నిలబడిన తీరును చూపించిన విధానం అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు, డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. 7.27 నిమిషాల నిడివి గల ఈ వీడియో ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతంగా ఎడిట్ చేయబడింది. ఈ వీడియో చూసిన అభిమానులు దీనిని రూపొందించిన వారికి సలాం చేస్తున్నారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ #HBDPawanKalyan హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు కాదు, ఆయనకు అభిమానులు కాదు భక్తులు ఉంటారని చాలామంది అంటారు. పవర్‌స్టార్ నుంచి పీపుల్స్ స్టార్‌గా ఆయన ఎదిగిన ప్రస్థానం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాని నుంచి ఏపీ ముఖ్యమంత్రి వరకు అనేకమంది ప్రముఖులు ఆయనకు ఎక్స్(ట్విట్టర్) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే సందర్భంలో, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్‌డేట్‌లు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఓజీ’ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ముంబై వీధుల్లో బ్లాక్ కారుపై స్టైలిష్‌గా కూర్చున్న పవన్ కళ్యాణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది.