Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్పెషల్ లుక్ రిలీజ్
Pawan Kalyan: అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో, నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప కానుక అందింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదలైంది.
ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బ్లాక్ సూట్, కౌబాయ్ క్యాప్‌తో సరికొత్త లుక్‌లో ఆయన ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘ఓజీ’ సినిమా షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన పవన్, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై దృష్టి సారించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఇందులో పవన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, పార్థిబన్, కేఎస్ రవికుమార్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పుట్టినరోజు పోస్టర్‌ను చూసి ఆనందంలో మునిగిపోయారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.
https://x.com/UBSTheFilm/status/1962497292889628851
కాగా.. ఈ సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సన్నివేశాన్ని భావోద్వేగాలు, పవర్ ఫుల్ యాక్షన్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నబకాంత మాస్టర్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు రూపుదిద్దుకున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, హరీష్ శంకర్ విజన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
