OG Trailer: ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ స్వాగ్‌కు ఫ్యాన్స్‌కు పూనకాలే
OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకున్నారో సరిగ్గా అలాగే సుజీత్ చూపించారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ ఓజాస్ గంభీర పాత్రలో కనిపించారు. ఆయన స్టైలిష్ లుక్స్, డైలాగ్స్, స్వాగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ముఖ్యంగా, ఎస్.ఎస్.తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ఆయన బీజీఎం ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ట్రైలర్‌లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓమీగా విలన్ పాత్రలో, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా కనిపించారు. వీరితో పాటు సీనియర్ నటి శ్రియా, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. డి.జె. టిల్లు ఫేమ్ నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది.
ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండుగలా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.
