ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ‘ఆది పురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.