Prabhas Adipurush : ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా బాయ్ కాట్ సెగ పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ మూవీని కూడా తాకింది. ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ (Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు
ఓం రౌత్ (Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొదట సినిమాపై భారీ అంచనాలు ఉన్నా కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ తో విమర్శలు రాగా, టీజర్ పై వ్యతిరేకతలు ఎక్కువయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ ట్రైలర్ కి అన్ని భాషల ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ వస్తుంది. అయితే నార్త్ లో మాత్రం కొన్ని వర్గాల వారు బాయ్ కాట్ ఆదిపురుష్ అనే నెగటివ్ ట్రెండ్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని, హిందూ మనోభావాలు దెబ్బ తీశారని పలువురు
ఆదిపురుష్ సినిమాపై పలుచోట్ల కేసులు కూడా నమోదు చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ ఏమాత్రం రామాయణానికి దగ్గరగా లేదని, అలానే ట్రైలర్ లో హనుమంతుని పాత్రపై కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే బాయ్ కాట్ సెగని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ట్రైలర్ పై అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో తో మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనీ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ మూవీని ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన భారీ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. అదేరోజు త్రీడీలో కూడా విడుదల చేస్తున్నారు.
Discussion about this post