Prabhas Fauzi: ప్రభాస్ ‘ఫౌజీ’పై పెరిగిన హైప్.. హను ఔట్‌పుట్‌కు డార్లింగ్ ఫిదా.. షూటింగ్ అప్‌డేట్ ఇదే
Prabhas Fauzi: ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను కలిగి ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్‌లో ఉన్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘ఫౌజీ’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల టైటిల్ రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే, ప్రభాస్ పూర్తి లుక్ కోసం అభిమానులు ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంతో పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ‘ఫౌజీ’ అవుట్‌పుట్ పట్ల ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నారట. దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్‌ను చాలా కొత్త కోణంలో, మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయట. ప్రతి ఒక్క ఫ్రేమ్ కళ్లు చెదిరేలా, ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. అంతేకాకుండా, ఈ చిత్రంలోని సంగీతం కూడా ఎంతో ప్రత్యేకంగా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా రూపొందుతోందని టాక్. మొత్తంగా, డార్లింగ్ ‘ఫౌజీ’ మ్యాజిక్‌కు ఫిదా అవుతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్‌లోనే ఈ చిత్రం మరో మైలురాయిగా నిలవబోతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, త్వరలోనే మైసూర్‌లో తదుపరి ముఖ్యమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యువ నటి ఇమాన్వీ (Imanvi) కథానాయికగా పరిచయమవుతోంది. ఈ పాన్-ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అసాధారణమైన కథాంశం, అద్భుతమైన అవుట్‌పుట్‌తో ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
