Kalki Sequel: కల్కి సీక్వెల్ అప్డేట్.. ‘కర్ణ 3102 బీసీ’ టైటిల్‌తో రాబోతున్న ప్రభాస్?
Kalki Sequel:ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. భారీ విజయం సాధించిన ఆ సినిమా క్లైమాక్స్‌లో ఇచ్చిన అద్భుతమైన సీక్వెల్ లీడ్ కారణంగా, తదుపరి భాగం ఎలా మొదలవుతుంది, దాని ముగింపు ఎలా ఉంటుంది అనే ఉత్సాహం ప్రేక్షకుల్లో రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో, సీక్వెల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
‘కల్కి 2898 ఏడీ’ ముగింపును కర్ణుడి పాత్రపైనే ఇచ్చారు నాగ్ అశ్విన్. అందువల్ల, రాబోయే సీక్వెల్‌లో కూడా కర్ణుడి (ప్రభాస్) పాత్రే కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అందుకే, ఈ తదుపరి భాగం కోసం చిత్ర బృందం ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
మహాభారతంలోని కర్ణుడే కలి యుగంలో ‘భైరవ’గా జన్మించాడని ‘కల్కి 2898 ఏడీ’లో దర్శకుడు చూపించారు. ఇప్పుడు సీక్వెల్‌లో కర్ణుడి ప్రయాణం ఏ దిశగా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) అత్యంత శక్తిమంతుడిగా మారగా, మరోవైపు కర్ణుడు (ప్రభాస్), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో, రాబోయే యుద్ధం ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇక, ఈ సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె వైదొలిగిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో అనుష్క, నయనతార, అలియా భట్ వంటి పలువురు నటీమణుల పేర్లు వినిపించినా, తాజాగా రుక్మిణీ వసంత్ పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కన్నడ బ్యూటీకి ఈ భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
