The Raja Saab: ‘ఏదో గుర్తుండిపోయే పని చేయాలి… సంచలనం అయిపోవాలి‘ రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్
The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆద్యంతం ఆసక్తిగా ట్రైలర్
‘ఏదో గుర్తుండిపోయే పని చేయాలి… సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేశాడని అందరూ షాక్ అయిపోవాలి’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రం హారర్, కామెడీ అంశాలతో వినోదాన్ని పంచుతూనే థ్రిల్లింగ్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఇదివరకు చూడని స్టైలిష్ అవతారంలో కనిపించనున్నారు.
ట్రైలర్‌లో ‘నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది…’ వంటి డైలాగులు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎక్సార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్ అయిన ఒక శక్తితో ప్రభాస్ ఎలా పోరాడాడు అన్నది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆయన తాత పాత్రలో మెరవనున్నారు. ‘తాత అద్భుతాలు చూసి ఆనందించాలి.. క్వశ్చన్లు వేయకూడదు..’, ‘పుట్టలో చెయ్యి పెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా? రాక్షసుడిని..’ వంటి డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌లు కథానాయికలుగా నటించారు. టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. మొత్తానికి, ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతికి ఒక అదిరిపోయే ట్రీట్ సిద్ధంగా ఉందని ట్రైలర్ స్పష్టం చేసింది.
