కొండ చరియలు విరిగి పడిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ అధికారుల నిర్లక్ష్యంపై ఎందుకు స్పందించలేదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకో లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొండ చరియలు విరిగి పడిన ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. అధికారుల నిర్లక్ష్యం ముందు చూపు సమన్వయం లేకపోవడమే అని ఆయన అన్నారు.
దసరా ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం నిర్వహణ ఖర్చులను ఎందుకు విడుదల చేయలేదో తెలపాలని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆలయ అభివృద్ధికి 70 కోట్లు ఇస్తానని ప్రకటన జారీ చేయించడం నమ్మశక్యంగా లేదని పోతిన విమర్శించారు.
అమ్మవారి పేరు ఉన్న 70 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లనే ముఖ్యమంత్రి గారు ఆలయ అభివృద్ధికి ప్రకటించారని, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి కాదని, ప్రాణ నష్టం జరిగితే గానీ.. ముఖ్యమంత్రి గారు స్పందించి చర్యలు తీసుకోరా అని అన్నారు.
