Prathyusha Sadhu in IPL 2023 : ఐపీఎల్ క్రికెట్ లో సంచలనం ఆకర్షణీయమైన సంబరం. ఐపీఎల్ రసవత్తరం, ఆసక్తికక్తిరంగా మారేది ప్లేయర్స్ ఆట వల్లనే కాదు. అందమైన కొందరు స్పోర్ట్స్ ప్రజెంటర్స్ వల్ల కూడా. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కం ఠగా వీక్షిస్తున్న ఇండియ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆఖరి బాల్ వరకు ప్రేక్షకులని మునివేళ్ల మీద కూర్చో పెడుతున్నారు.

ఐపీఎల్ మ్యాచుల్లో ప్లేయర్స్ ఫీట్లతో పాటు అందరి దృష్టిని ఆకర్షించే మరో విషయం యాంకర్స్. మరీ ముఖ్యంగా మహిళా యాంకర్స్. ఇప్పటికే ఎన్నో ఐపీఎల్ అందాలను చూసి ఫిదా అయిఉంటాం. తమ మాట తీరుతో ఆట గురించి తమదైన స్టైల్లో వివరిస్తూ ఈసారి ఓ తెలుగుందం కూడా మెరిసింది. ఆమె జాదు ప్రత్యూష.. మైదానానికే ఓ వెలుగు తెస్తోంది అందం, వాక్చాతుర్యంతో క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకర్షిస్తోంది.
కాంచనమాల సీరియల్లోనూ నటించిన జాదు ప్రత్యుష, పలు బ్రాండ్ ప్రచార చిత్రాల్లోనూ మెరిసింది. క్రిష్ దర్శ కత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు లోనూ ఓ పాత్ర పోషించింది నటనతో పాటు ఈమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టమట. ఆ మక్కువతోనే ఇప్పుడు ఐపీఎల్ తెలుగులో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈమెకు ఐదేళ్ల కిందటే వివాహమైంది. భర్త పోత్సాహంతో తన కిష్టమైన ప్రొఫెషనల్లో రాణిస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ చురుగ్గా వుంటూ రీల్స్ కూడా చేస్తోంది ప్రత్యుష.
https://instagram.com/prathyusha.sadhu?igshid=YmMyMTA2M2Y=
