Predator Badlands: ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ ట్రైలర్‌తో ఇండియన్ ఆడియన్స్ ఫిదా
Predator Badlands: హాలీవుడ్ నుంచి వస్తున్న సరికొత్త సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ భారతీయ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన క్షణం నుంచీ సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. కేవలం విజువల్స్, గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో ఉన్న ‘యాక్షన్-ఎమోషన్’ కలయిక భారతీయ సినిమా అభిమానులకు పక్కా ‘మసాలా ఫీలింగ్’ ఇస్తోందని నెటిజన్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
విడుదలైన ట్రైలర్ ప్రకారం ఈ చిత్రం యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉన్నాయి. ప్రతి సన్నివేశంలోనూ ఉండే థ్రిల్ ఎక్కడా తగ్గకుండా ఉంటుందని, జెన్నా గ్రహంపై జరిగే ప్రెడేటర్ వేట, హీరో డెక్ ఫైట్స్ అన్నీ థియేటర్‌లో ప్రేక్షకులకు ఒక పండగలా అనిపించబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి, ఈ సినిమాలో రూపొందించిన సృజనాత్మక యుద్ధ సన్నివేశాలు యాక్షన్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి.
ఈ చిత్రానికి భారతీయ ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేస్తున్న ప్రధాన అంశం కేవలం యాక్షన్ మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఎమోషన్. హీరో డెక్ తన తండ్రి ఆమోదం కోసం, అలాగే తన తమ్ముడు క్వేయ్ను రక్షించుకోవడం కోసం చేసే పోరాటం – ఇది కేవలం గ్రహాంతర వేట కాదు, కుటుంబ గౌరవం కోసం, తన వారి కోసం చేసే త్యాగంగా నిలుస్తోంది. ఈ బలమైన ఫ్యామిలీ యాంగిల్ మరియు పగ తీర్చుకునే ఎలిమెంట్, భావోద్వేగపూరితమైన డైలాగులతో కలగలిసి భారతీయ ప్రేక్షకులకు పక్కాగా కనెక్ట్ అయ్యేలా సినిమాకు మసాలా బేస్‌గా నిలుస్తోంది.
అంతేకాక ఈ ఉద్రిక్తమైన కథాంశానికి కాస్త ఉపశమనం అందించడానికి, హీరో డెక్‌కు తోడుగా ఉండే వాగుడుకాయ ‘థియా’ (సింథెటిక్ రోబో), అలాగే చిన్న ఏలియన్ బడ్‌తో కూడిన కామెడీ ట్రాక్ కూడా జోడించబడింది. ఈ త్రయం మధ్య కెమిస్ట్రీ సినిమాకు కొత్త ఎనర్జీని ఇస్తూ, ప్రేక్షకులను నవ్విస్తోంది. యాక్షన్, ఎమోషన్, హాస్యం పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో నిండిన ఈ చిత్రం “పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్” అవుతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.
