Priyanka Mohan: ‘ఓజీ’ మూవీ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టిన ప్రియాంక మోహన్
Priyanka Mohan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ల జోరు ఊపందుకుంది. ఈ క్రమంలో, చిత్రంలో కథానాయికగా నటించిన ప్రియాంక మోహన్, ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటూ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. దీంతో సినిమాకు సంబంధించిన హైప్ మరింత పెరిగింది.
‘ఓజీ’లో తన పాత్ర గురించి ప్రియాంక మాట్లాడుతూ, ఈ సినిమా కథ 1980ల కాలం నాటిదని, తన పాత్ర అమాయకంగా ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ “ఓజాస్ గంభీర” పాత్రలో అద్భుతంగా నటించారని ఆమె ప్రశంసించారు. ఇటీవల విడుదలైన ‘సువ్వి సువ్వి’ పాటపై కూడా ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ పాట తనకు ఎంతో ఇష్టమని, రెండేళ్లుగా దాని విడుదల కోసం ఎదురు చూశానని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవమని ప్రియాంక తెలిపారు. “పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి. సెట్స్‌లో అందరినీ సమానంగా చూస్తారు. బుక్స్ గురించి, అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడేవారు. ఆయనతో పనిచేయడమే ఒక మెమొరీ. ఆయనకు బిడియం ఎక్కువగా ఉంటుంది” అని చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదని, అయితే ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నారని అన్నారు. బాధ్యత పెరిగినప్పటికీ, ఇప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారని ఆమె తెలిపారు.
ఈ సినిమా పాన్-ఇండియా లెవెల్‌లో విడుదల కానున్న నేపథ్యంలో, ఇతర భాషల్లోనూ ప్రమోషన్లు ఎలా ఉంటాయనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండటంతో హిందీలో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని పెద్ద ప్రమోషనల్ ఈవెంట్లు, మ్యూజిక్ ఈవెంట్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వంటివి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ప్రమోషన్లు సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయం. ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.