అమ్మోనియం నైట్రేట్ నిల్వల వలన జరగబోయే విధ్వంసం తలుచుకుంటే భయాందోళనలు కలిగిస్తున్నాయని, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధమైన చర్యలు తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్ లో ఓడరేవులో జరిగిన విధ్వంసం కారణంగా 156 మంది అగ్నికి ఆహుతయ్యారు.
బీరుట్ కంటే ఐదు రెట్లు అధికంగా విశాఖలో ఈ ప్రమాదకర రసాయనం నిల్వలు ఉన్నాయని ఈ విషయంలో అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో జరగబోయే విధ్వంసం ఊహకు అందని విధంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు
