ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా తో సహజీవనం తప్పదని మొదట్లోనే ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు పునఃప్రారంభం గురించి కూడా ఇదే విధమైన రీతిలో ప్రకటన చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం చర్యలు తీసుంటున్నప్పటికీ రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజల్ని ఆందోళనలోకి నెడుతున్నాయి.
ఈ క్రమంలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్ల పునఃప్రారంభం గురించి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కొన్ని కఠినమైన విధి విధానాలు రూపొందించి తిరిగి విద్యాబోధన అమలు చేయాలని భావిస్తోంది.దీనిపై ఒక ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంలో సుముఖుంగా లేనట్టు తెలుస్తోంది. ఒక విద్యా సంవత్సరం నష్టపోయినా ఫర్వాలేదు గానీ ఇప్పుడు పిల్లల్ని స్కూలుకి పంపే ప్రసక్తి లేదని చెబుతున్నారు. కరోనా కట్టడికి ఏదో వ్యాక్సిన్ వచ్చేదాకా వేచి చూస్తేనే బెటర్ అని లేకపోతే లేనిపోని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు