Pushpa Kesava Arrested : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కుడి భుజంగా ఉంటూ, నమ్మినబంటు పాత్రలో ఒదిగిపోయినటువంటి నటుడు కేశవ మీకు గుర్తుండే ఉంటాడు కదా, ఇప్పుడు ఆ కేశవ ఒక కేసు వివాదంలో చిక్కుకొని పోలీస్ స్టేషన్ పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే జగదీష్, ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తి కలిసి ఉన్నప్పుడు వారికి తెలియకుండా
ఫోటోలు తీయడం, వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తానని ఆమెను బెదిరించడం వల్ల, పంజాగుట్ట పరిధిలో నివాసముంటున్న ఆ మహిళా (జూనియర్ ఆర్టిస్టు) గత నెల 29న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తుంది.
ఈ ఘటన మీద విచారణ చేపట్టిన పోలీసులకు దాంట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ మహిళతో జగదీష్ కి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక జగదీష్ విషయానికొస్తే అతను ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తర్వాత 2019లో మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

ఆ తర్వాత పలాస, బుట్ట బొమ్మ, విరాట పర్వం లాంటి చిత్రాలలో కూడా నటించాడు. కానీ పుష్పా లో అల్లు అర్జున్ పక్కన చేసినటువంటి క్యారెక్టర్ కి జగదీష్ కి మంచి పేరు దక్కింది. ఆ క్యారెక్టర్ కి జగదీష్ కి చాలా ఫాలోయింగ్ కూడా పెరిగింది. తర్వాత రాబోతున్న పుష్ప 2 లో జగదీష్ క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్ గా ఉండబోతుందని ప్రచారం కూడా బాగా జరిగింది. కానీ ఎవరూ ఊహించని విదంగా ఇంతలోనే ఈ కేసులో నిందితుడిగా అయ్యాడు.
