• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Raakh Web Series: ‘పాతాళ్ లోక్’ దర్శకుడి డైరెక్షన్‌లో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..

Raakh Web Series: 'పాతాళ్ లోక్' దర్శకుడి డైరెక్షన్‌లో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..

Sandhya by Sandhya
August 18, 2025
in Entertainment, Latest News, Movie
245 7
0
Raakh Web Series: ‘పాతాళ్ లోక్’ దర్శకుడి డైరెక్షన్‌లో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Raakh Web Series: ‘పాతాళ్ లోక్’ దర్శకుడి డైరెక్షన్‌లో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..

 

Raakh Web Series: ప్రేక్షకులను ఆకట్టుకునే సరికొత్త కథాంశాలతో ముందుకు వస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఇప్పుడు మరో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ను ప్రకటించింది. ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అలీ ఫజల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌కు ‘రాఖ్‌’ అని పేరు పెట్టారు. ఇందులో సోనాలి బింద్రే, అమీర్‌ బషీర్‌ వంటి ప్రముఖులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ వెబ్‌సిరీస్‌కు ‘పాతాళ్‌ లోక్‌’ ఫేమ్ దర్శకుడు ప్రొసిత్‌ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు అనూష నందకుమార్‌, సందీప్‌ సాకేత్‌లు కూడా దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ సిరీస్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. వచ్చే ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌లో ‘రాఖ్‌’ విడుదల కానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘బూడిద నుంచి న్యాయం బయటకు వస్తుంది’ (Justice will rise from the ashes) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచింది.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రొసిత్‌ రాయ్ ఈ ప్రాజెక్ట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శకులు నందకుమార్‌, సాకేత్‌ల విజన్‌ను ప్రశంసిస్తూ, ఈ సిరీస్‌లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా కథ, కథనాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. న్యాయం, నైతికత అనే ప్రశ్నార్థకమైన అంశాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నాం అని పేర్కొన్నారు. భారతీయ కథా ప్రపంచంలో ఇలాంటి భిన్నమైన, లోతైన పాత్రలతో కథను తెరకెక్కించడం ఒక సాహసవంతమైన అడుగు అని ప్రొసిత్‌ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులు ఒక శక్తివంతమైన కథను చూడబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పాతాళ్ లోక్ సిరీస్‌లో.. హథీరామ్‌ చౌదరి (జైదీప్‌ అహ్లవత్‌) అదే పార్‌ జుమునాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆఫీసర్‌గా కొనసాగుతూ ఉంటాడు. అతడి జూనియర్‌గా చేరిన ఇమ్రాన్‌ అన్సారీ (ఇష్వాక్‌ సింగ్‌) సివిల్స్‌ పాసై ఐపీఎస్‌ ఆఫీసర్ అవుతాడు. నిత్యం ఆందోళనలతో అట్టుడికిపోతున్న నాగాలాండ్‌లో శాంతి స్థాపన చేసి, అభివృద్ధి పనులు చేపట్టాలని కొంతమంది నాగాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసమని దిల్లీ వస్తారు.

అలా వచ్చిన వారిలో కీలక వ్యక్తి అయిన జొనాథన్‌ థామ్‌ (కగురోంగ్‌ గోన్మీ)ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేస్తారు. ఈ కేసు విచారించే బాధ్యతను యువ ఐపీఎస్‌ అయిన ఇమ్రాన్‌ అన్సారీకి పోలీస్‌శాఖ అప్పగిస్తుంది. మరి హథీరామ్‌ చౌదరి ఈ కేసు విచారణలోకి ఎలా వచ్చాడు? థామ్‌ హత్య వెనక ఎవరున్నారు?(paatal lok season 2 review) ఇమ్రాన్‌తో కలిసి హథీరామ్‌ నాగాలాండ్‌ వెళ్లిన తర్వాత అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నదే ఈ సిరీస్‌.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Ali Fazal Mirzapurnew crime thriller from the director of Paatal LokRakh web seriesRakh web series on Amazon Prime VideoRakh web series Paatal LokRakh web series Prosit RoyRakh web series starring Ali Fazalఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రాఖ్‌ వెబ్‌సిరీస్‌అలీ ఫజల్ మీర్జాపూర్‌అలీ ఫజల్‌ హీరోగా రాఖ్‌ వెబ్‌సిరీస్‌పాతాళ్ లోక్ దర్శకుడి కొత్త క్రైమ్ థ్రిల్లర్రాఖ్‌ వెబ్‌సిరీస్‌రాఖ్‌ వెబ్‌సిరీస్‌ పాతాళ్ లోక్రాఖ్‌ వెబ్‌సిరీస్‌ ప్రొసిత్‌ రాయ్‌
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.