Pawan Kalyan: మిలియన్ల మందికి స్ఫూర్తి.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లోకేషన్ పిక్ షేర్ చేసిన రాశీ ఖన్నా
Pawan Kalyan: అగ్ర కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో, పవన్ కళ్యాణ్‌తో తొలిసారిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న రాశీ ఖన్నా, ఆయనకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపారు.
రాశీ ఖన్నా తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక అరుదైన ఫోటోను పంచుకున్నారు. అందులో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి ముగ్గురూ షూటింగ్ లొకేషన్‌లో ఒక సన్నివేశం గురించి చర్చిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ, “పవన్ కళ్యాణ్ సర్, మీ బలం, క్రమశిక్షణ, చిత్తశుద్ధి ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు మరిన్ని విజయాలను అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని రాశీ ఖన్నా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటిస్తుండగా, రాశీ ఖన్నా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ కొత్త సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ చెప్పిన “భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ఫార్మన్స్ బద్దలైపోద్ది” అనే డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ డైలాగ్‌తోనే హరీష్ శంకర్ ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఒక హింట్ ఇచ్చారు.