Rahul Fire on Amit Shah : జమ్ము కాశ్మీర్ కు సంబంధించిన విషయం పై రాజ్యసభలో దుమారం రేగింది. సోమవారం రోజు రాజ్యసభలో, అమిత్ షా మాటలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ముఖ్యంగా అమిత్ షా, దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై, గత కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో, రాహుల్ గాంధీ కూడా అంతే తీవ్రంగా మాట్లాడారు.
రాజ్యసభలో జమ్ము కాశ్మీర్ బిల్లు పై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “కేవలం ఒక వ్యక్తి పొరపాటు వల్ల భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ భాగం కావడం ఆలస్యమైంది,” అంటూ వ్యాకరణ చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడిగా ఖండించారు. అమిత్ షా ముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి.
నెహ్రూ గారు తన జీవితాన్ని ఈ దేశం కోసమే అంకితం ఇచ్చారు. దేశ ప్రజల కోసం ఆయన ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. ఇది తెలుసుకోకుండా హోం మంత్రి అమీత్ షా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. బహుశా అమిషాకి చరిత్ర తెలియదు కాబోలు. అందుకే మాటిమాటికీ చరిత్రను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు, అని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు రాహుల్ గాంధీ.
దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించారు, అందుకే భాజపా ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తూ అనవసరమైన విషయాలను మాట్లాడుతుంది అని రాహుల్ అన్నారు. నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరు చేతుల్లో ఉంది. ఇవన్నీ ప్రధాన అంశాలు. వీటిపై చర్చ చేసేందుకు బిజెపి భయపడుతుంది. అసలైన విషయాలను పక్కనపెట్టి అనవసరమైన విషయాలను మాట్లాడుతుంది అని రాహుల్ బిజెపి ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
అయితే జమ్ము కాశ్మీరు పునర్వ్యవస్థీకరణ, జమ్ము కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం రూపం తెచ్చింది. కాశ్మీర్ శరణార్థుల నుండి ఇద్దరిని, పాక్ ఆక్రమిత కశ్మీర్ నిర్వాసితుల నుండి ఒకరిని శాసనసభకు నామినేట్ చేసేందుకు, కొన్ని వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయి. లోక్‌సభ కిందటి వారమే ఈ బిల్లుల్ని ఆమోదించగా.. ఈ బిల్లుపై సుమారు నాలుగు గంటల పాటు చర్చ వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత బిల్లును ఆమోదించడం జరిగింది. తర్వాత దశలో రాష్ట్రపతి బిల్లును ఆమోదిస్తే దానిని చట్టాపరం చేసే అవకాశాలు ఉన్నాయి.