Rahul Gandhi Bhartah Nyaya Yatra : కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కో మెట్టు ఎక్కుతూ, పూర్వ వైభవాన్ని చూడడానికి రెడీ అవుతున్న వేళ, ఆ విజయం వెనుక రాహుల్ గాంధీ పాత్ర చాలా వరకు ఉంటుంది. ఆయన చేసినటువంటి “భారత్ జూడో యాత్ర” ప్రజలకు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని చాలా దగ్గర చేసింది. ఆయన ఒక్కో సమస్యను తెలుసుకుంటూ, ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది అనే నమ్మకాన్ని కల్పించారు.
ఆ నేపద్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ విజయ ప్రభంజనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరొక కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ “భారత్ జూడో యాత్రను” కొనసాగింపుగా “భారత్ న్యాయయాత్ర” చేయాలని నిర్ణయించుకున్నారు అంట, ఇక వివరాల్లోకి వెళితే..

ఈ యాత్రను మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్రగా, పాదయాత్రగా రాహుల్ చేయనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ యాత్రను నాగాలాండ్, మేఘాలయ, బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్ గుజరాత్ మీదుగా రాహుల్ చేపట్టనున్నారు. ఈ యాత్రలో మొత్తంగా రాహుల్ గాంధీ 6200 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నారు.
ఇక రాహుల్ గాంధీ కొత్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారని విషయం బయటకు రావడంతో, బిజెపి లోను కొత్తవణుకు మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జోడోయాత్ర ద్వారానే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో బిజెపి పట్టు కోల్పోయింది, బీఆర్ఎస్ ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి తెలంగాణ ఆ పార్టీ చేతిలో నుండి చేజారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ చేపట్టిన కొత్త పథకాలతో తెలంగాణలో దూసుకు వెళ్తుంది. రాహుల్ గాంధీ కొత్తగా చేపట్టిన భారత్ న్యాయ యాత్ర ఇంకా ఎన్ని ప్రభంజనాలను సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే..
