దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సహంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాలలో కొనసాగనుంది.
పాదయాత్ర రూట్‌మ్యాప్ కూడా ఖరారు అయినట్టు సమాచారం. అక్టోబర్ 14 వ తేదీన జోడో యాత్ర ఆంధ్రాలోకి రానుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు కూడా చేస్తోంది.
ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బలమైన పార్టీ కాంగ్రెస్. రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ ప్రకటించాక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. అనూహ్యంగా తెలంగాణలో కూడా అదే పరిస్థితి తెచ్చుకొని ఇరు తెలుగు రాష్ట్రాల్లో తన ప్రాభవాన్ని కోల్పోయింది. తెలంగాణలో ఇప్పుడు కొంత మెరుగైన పరిస్థితి నెలకొనగా ఆంధ్రప్రదేశ్లో ఈ భారత్ జోడోయాత్ర ద్వారా తిరిగి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా?