Rain Alerts:అలెర్ట్….తెలంగాణాలో నేడు రేపు వర్షాలు
తెలంగాణాలో ఇవాళ రేపు వర్షాలు కురవనున్నాయి.విదర్భ లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది.ప్రస్తుతం ఈ ద్రోణి యొక్క ప్రభావం జార్ఖండ్ నుండి ఒడిశా, కోస్తాంద్ర, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ల ఎత్తు వద్ద కొనసాగుతుంది.
దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు దాదాపు రెండు రోజుల వరకు తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయయని.. అలాగే అక్కడక్కడా మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ అధికారులు తెలిపారు.