RAINBOW Diet : రెయిన్ బో డైట్.. రెయిన్ బో డైట్ ఇదేదో కొత్తగా అనిపిస్తుంది, కానీ ఈ డైట్ షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులకు చెక్ పెట్టి ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. అసలు ఈ రెయిన్ బో డైట్ అంటే ఏంటి.. దాని ఉపయోగాలేంటో చూద్దాం.. మనకు రెయిన్ బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో, మనం తినే ఆహరంలో కూడా అన్ని రంగుల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దీనినే రెయిన్ బో డైట్ అంటారు.
పసుపు రంగు..
పసుపు రంగు ఆహారాల్లో బ్రోమెలైన్ పాపైన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, రక్తపోటును నివారిస్తుంది. అలాగే వయసుకు సంబందించిన వ్యాధులను అరికట్టడంలో పసుపు రంగు ఆహారం ఎంతో పని చేస్తుంది. పసుపు రంగు ఆహారంగా మామిడి, బొప్పాయి, మొక్కజొన్న, నిమ్మకాయలను మనం వాడుకోవచ్చు.
ఆరెంజ్ కలర్..
ఆరెంజ్ కలర్ ఉన్న ఆహార పదార్థాల్లో మనకు కెరోటిన్ దొరుకుతుంది. అయితే కేరోటిన్ ఎక్కువగా ఉండే క్యారెట్, ఆరెంజ్ ఫ్రూట్స్, గుమ్మడి వంటి వాటిని తీసుకోవడం వల్ల కంటిచూపుకు చాలా మేలు చేస్తాయి. అలాగే జట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి.
ఎరుపు రంగు..
ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు పండ్లు, కూరగాయాలు. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు మన దరి చేరవు. మనం తినే ఆహారంలో ఖచ్చితంగా దానిమ్మ పండ్లు, పుచ్చకాయలు, టొమాటో, యాపిల్ లాంటివి ఉండేలా చూసుకోవాలి.
తెలుపు రంగు ఆహారం..
తెలుపు రంగు ఆహారాల్లో మనకు ఫైబర్, పొటాషియం చాలా ఎక్కువగా లభిస్తుంది. ఇవి మలబద్దకాన్ని, పైల్స్ ను కంట్రోల్ చేస్తాయి. ఉల్లి, ముల్లంగి, పాలు, పెరుగు, కొబ్బరి, మష్రూమ్స్ ను తెలుపు రంగు ఆహారంగా తీసుకోవచ్చు.
నీలం రంగు ఆహారం..
నీలం రంగు ఆహారం మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాళ్ళ వాపులను తగ్గిస్తాయి. నల్ల ద్రాక్ష, వంకాయ, చేర్రీలను నీలం రంగు ఆహారంగా తీసుకోవచ్చు.
ఆకుపచ్చ ఆహారం..
ఆకకుపచ్చ ఆహారం అంటే ఆకుకూరలు. మనకు ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇది మధుమేహం, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.