రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్‌తో సినిమా నిర్మించడానికి నిర్మాత కె.ఎల్. నారాయణ ప్లాన్ చేశారు. ఇన్నాళ్లకు కానీ అది వాస్తవరూపం దాల్చడం లేదు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో మంచి పాపులారటీ వచ్చింది. ఇక ఇది అలా ఉంటే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టెంట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా నిజ జీవిత సంఘటన ఆధారంగా వస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ బాలీవుడ్ మీడియాతో తెలిపినట్లు టాక్.మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ లాస్ ఏంజెల్స్‌కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చున్నారట.
ఈ సంస్థ కాస్టింగ్‌తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి సేవలను అందిస్తుంది. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చినట్టు సమాచారం.