మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. దసరా రోజు థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది.
మొదటి వారం లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా హిందీలో కూడా కలెక్షన్స్ కుమ్మేస్తుంది..అభిమానులనే కాదు సెలబ్రిటీలనూ అలరించింది ఈ చిత్రం. అయితే లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని చూశారట. సినిమా చూస్తున్నంతసేపూ ఫుల్ గా ఎంజాయ్ చేశారట.
అంతేకాక ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాపై రజనీ చేసిన కొన్ని వ్యాఖ్యలను దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అద్భుతం, చాలా బాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యల పట్ల డైరెక్టర్ మోహన్ రాజా సంతోషం వ్యక్తం చేస్తూ, థాంక్స్ తెలిపారు. తన జీవితం లో ఇదొక బెస్ట్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు