Coolie OTT Streaming: ‘కూలీ’ రిలీజ్‌కు ముందే మరో సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన..!
Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’, విడుదల దగ్గర పడుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఒక అనూహ్యమైన నిర్ణయంతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇటీవల చెన్నైలో జరిగిన ‘కూలీ’ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నేరుగా ఓటీటీలో విడుదల చేసి, సినిమాపై మరింత హైప్ పెంచింది.
కూలీ అన్‌లీష్డ్..
ఈ మెగా ఈవెంట్‌ను ‘Coolie Unleashed’ పేరుతో సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఈవెంట్‌లో రజనీకాంత్ తనదైన శైలిలో చేసిన ఫన్నీ స్పీచ్, సంగీత దర్శకుడు అనిరుధ్ అద్భుతమైన పెర్ఫామెన్స్, అలాగే ఇతర అగ్ర నటీనటులు పంచుకున్న విశేషాలు ఇందులో చూడవచ్చు. అంతేకాకుండా, నటుడు సౌబిన్ షాహిర్ చేసిన ‘మోనికా’ డ్యాన్స్ కూడా ఈ కార్యక్రమం మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.
దుమ్మురేపుతున్న బుకింగ్స్..
ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు అగ్ర నటులైన నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రుతి హాసన్ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ భారీ తారాగణం, ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ‘కూలీ’తో లోకేశ్ కనగరాజ్ తన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) కి భిన్నంగా మరో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈసారి కూడా రజనీకాంత్ మ్యాజిక్ స్క్రీన్‌పై పక్కా అని దర్శకుడు లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా.. ‘కూలీ’ ప్రచార చిత్రాల్లో వాచ్‌ను హైలైట్ చేయడంతో చాలా మంది ఇది టైమ్ ట్రావెల్ మూవీ అనుకుంటున్నారు. దీనిపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్పందించారు. కూలీ సినిమాలో వాచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉన్నాయని.. యాక్షన్ సన్నివేశాలు చాలా కీలకం అని తెలిపారు. ఈ సినిమా LCUలో భాగం కాదని లోకేశ్ స్పష్టం చేశారు. ‘కూలీ’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.