Rakul Preet Singh: పెళ్లి తర్వాత కూడా తగ్గని జోరు.. రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ స్టిల్స్‌తో రచ్చ
Rakul Preet Singh: టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనదైన ముద్ర వేసిన నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఆమె నటించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే 2’ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ వేడుకల్లో పాల్గొంది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన రొమాంటిక్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ నటి, తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘సరైనోడు’, ‘ధృవ’ వంటి విజయాలతో టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, వరుసగా కొన్ని సినిమాలు నిరాశపరచడంతో ఆమె తన దృష్టిని బాలీవుడ్‌పై మళ్లించింది. అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా మారింది. సినిమా ఆఫర్లు తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
2024లో నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న రకుల్, గోవాలో జరిగిన ఎకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్యను తగ్గించినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె చురుకుగా ఉంటుంది. ఫ్యాషన్, ట్రావెల్, ముఖ్యంగా ఫిట్‌నెస్ కంటెంట్‌తో అభిమానులను ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఫిట్‌నెస్ ప్రీక్గా పేరున్న రకుల్.. తరచూ తన జిమ్, యోగా సెషన్ల ఫోటోలను షేర్ చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తుంది. బీచ్ ఫోటోషూట్‌లలో బుల్లి నిక్కర్, షార్ట్ టాప్స్‌లో ఆమె కనిపించే హాట్ లుక్స్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.
సినీ రంగంతో పాటు వ్యాపారంలోనూ పెట్టుబడులు పెట్టిన రకుల్‌కు హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్ సెంటర్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె వద్ద మెర్సిడెస్ మేబాక్ GLS 600, రేంజ్ రోవర్, BMW 520d వంటి పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. సినీ వర్గాల అంచనా ప్రకారం, రకుల్ ప్రీత్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 50 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
