Ram Charan and Allu Arjun : వైజాగ్ లో మకాం వేయనున్న మెగా పాన్ ఇండియా స్టార్స్.. ఎందుకో తెలుసా..
రాబోవు పదిరోజుల పాటు వైజాగ్ నగరం మెగా హీరోల సందడితో కళకళ లాడబోతోంది. మెగా పాన్ ఇండియా స్టార్స్ తాకిడితో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం రానుంది. మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో.. అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీనితో అల్లు అర్జున్ ఆల్రెడీ వైజాగ్ లో ల్యాండ్ అయిపోయాడు. అభిమానులు భారీ ఎత్తున బన్నీకి ఘనస్వాగతం పలికారు. దాదాపు పదిరోజుల వరకు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇక రాంచరణ్ కూడా రేపో ఎల్లుండో వైజాగ్ లో ల్యాండ్ కాబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభం కాబోతోంది. ఇది చాలా లెన్తీ షెడ్యూల్ అని అంటున్నారు. మరి ఎన్ని వారాలు చరణ్ వైజాగ్ లో ఉంటాడో క్లారిటీ లేదు.
మొత్తంగా మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు వైజాగ్ లో సందడి చేయనుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. గేమ్ ఛేంజర్ వైజాగ్ షెడ్యూల్ లో కీలక నటీనటులంతా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ చిత్రం ఆలస్యం అవుతుండడంతో మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీకి మోక్షం లభిస్తుందో చూడాలి.