Peddi: పుణెలో ‘పెద్ది’ పాట.. కొత్త షెడ్యూల్ ప్రారంభించిన మూటీ టీమ్
Peddi: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో, చిత్రం బృందం గురువారం నుంచి పుణెలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.
ఈ తాజా షెడ్యూల్‌లోనే ముఖ్యంగా హీరో రామ్‌చరణ్, నాయిక జాన్వీ కపూర్లపై ఓ భారీ పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాట కోసం సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన, ప్రత్యేకమైన మెలోడీని అందించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్పెషల్ సాంగ్‌ను స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో, అత్యంత భారీ విజువల్ హంగులతో, అద్భుతమైన సెట్స్‌లో రూపొందించనున్నారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’ రూపొందుతోంది. సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గడువులోగా చిత్రీకరణను పూర్తి చేయాలనే పట్టుదలతో మేకర్స్ పనిచేస్తున్నారు. అందుకే షూటింగ్‌తో పాటుగా, సమాంతరంగా నిర్మాణాంతర పనులను కూడా వేగవంతం చేస్తున్నారు.
యంగ్ ప్రొడ్యూసర్ వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సమర్పిస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేశంలోనే అత్యుత్తమ కెమెరామెన్‌లలో ఒకరైన ఆర్. రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. ఈ కలయిక అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు, పాన్-ఇండియా ప్రేక్షకులను అలరించేలా భారీ స్థాయిలో రూపొందుతున్నట్లు సమాచారం.