Ram Charan – Jr NTR : ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకుని RRR మూవీ చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అనే భ్రమలో ఉన్న అందరూ ఉన్న అందరికీ బాహుబలితో కళ్ళు తెరిపించిన రాజమౌళి, ఇప్పుడు RRR తో చుక్కలు చూపించారు. ఇప్పుడు ఏ నోట విన్న నాటు నాటు పాటే మార్మోగిపోతుంది. యావత్ భారత్ RRR టీంని ప్రశంసలతో ముంచెత్తుతుంది.
దేశ ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రత్యేక అభినందనలు తెలియజేయగా.. అవార్డ్ అందుకొన్న మధుర క్షణాలను తలచుకుంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్స్ చేసారు. గ్లోబల్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు గెలుపొందడం పట్ల ఎమోషనల్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎప్పటికీ స్పెషల్ మూవీగా మా జీవితాల్లో, ఇండియన్ సినిమా చరిత్రలో ఉంటుంది.
ఇంకా డ్రీమ్ లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇండియన్ మూవీ గా గెలిచాం అని, ఆస్కార్ అవార్డు ఇంటికి వస్తోంది అంటూ చరణ్ ట్వీట్ చేయగా.. అవార్డ్ సాధించిన సందర్భంగా ఎన్టీఆర్ RRR మూవీ టీంను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. గత కొన్ని రోజులగా ఎన్టీఆర్, చరణ్ న్యూయార్క్ లో ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
https://twitter.com/AlwaysRamCharan/status/1635151004298772480?t=N5DoCO8ULgDSEaleDCnXjA&s=19
https://twitter.com/tarak9999/status/1635151033432432641?t=SaVLvB_yoJhKD0bDZXkUNQ&s=19
Discussion about this post