Ram Charan : ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో RC15 మూవీలో నటిస్తూనే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆస్కార్ కంటే ముందే US వెళ్లిన చెర్రీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ప్రధానోత్సవంలో ప్రెజెంటర్ గా వ్యవహరించడంతో పాటు అక్కడ పలు మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.

మొత్తానికి అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు RRR మూవీ నుంచి నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ అవార్డ్ తో యావత్ భారత్ ఆనందడోలికల్లో మునిగి తేలింది. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొన్న హైదరాబాద్ కి విచ్చేయగా.. ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.
నిన్న ఢిల్లీ చేరుకున్న చరణ్ అక్కడ BJP అధ్యక్షుడు అమిత్ షాను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో చరణ్ తో పాటు మెగాస్టార్ చిరు కూడా ఉన్నారు. అలాగే ఢిల్లీలో ఇండియా టుడే Conclave లో పాల్గొన్నాడు చరణ్. అనంతరం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హైదరాబాద్ కు చేరుకున్న చెర్రీకి మెగా అభిమానులు ఊహించని రీతిలో ఘన స్వాగతం పలికారు.
