• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

RGV Rajamouli: దేవుడికి నాస్తికులే ఇష్టం.. రాజమౌళి వివాదంపై స్పందించిన ఆర్జీవీ

RGV Rajamouli: దేవుడికి నాస్తికులే ఇష్టం.. రాజమౌళి వివాదంపై స్పందించిన ఆర్జీవీ

Sandhya by Sandhya
November 21, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
RGV Rajamouli: దేవుడికి నాస్తికులే ఇష్టం.. రాజమౌళి వివాదంపై స్పందించిన ఆర్జీవీ
Spread the love

RGV Rajamouli: దేవుడికి నాస్తికులే ఇష్టం.. రాజమౌళి వివాదంపై స్పందించిన ఆర్జీవీ

 

RGV Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల ఓ అంతర్జాతీయ వేదికపై దేవుడి నమ్మకాల గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ తనకు దేవుడిపై నమ్మకం లేదని, తాను నాస్తికుడిని అని ప్రకటించారు. అయితే, భారతీయ ఇతిహాసాలతో సినిమాలు తీసి కోట్లు గడించే రాజమౌళి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పలు ధార్మిక సంఘాలు, కొందరు బీజేపీ నేతలు ఆయనపై మండిపడ్డారు. రాజమౌళి తక్షణం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళికి మద్దతుగా నిలుస్తూ, విమర్శకులపై తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు.

ఆర్జీవీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. “రాజమౌళిపై విషం చిమ్ముతున్న స్వయం ప్రకటిత ధర్మ రక్షకులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. దేవుడిని నమ్మడం ఎంత హక్కో, నమ్మకపోవడం కూడా అంతే హక్కు. ఒక వ్యక్తి నాస్తికుడిగా ఉండటం ఈ దేశంలో నేరం కాదు. మీకు దేవుడిని పూజించే స్వేచ్ఛ ఉన్నప్పుడు, రాజమౌళికి దేవుడు లేడని చెప్పే స్వేచ్ఛ కూడా ఉంటుంది” అని రాజ్యాంగ పాఠాలు చెప్పారు.

ఇక దేవుడిని నమ్మని రాజమౌళి, దేవుడి సినిమాలు ఎందుకు తీస్తున్నారని విమర్శించే వారికి ఆర్జీవీ లాజికల్ కౌంటర్ ఇచ్చారు. “ఇదో మూర్ఖపు వాదన.. ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే అతను నిజ జీవితంలో గ్యాంగ్‌స్టర్ అయి ఉండాలా? లేక హారర్ సినిమా తీయాలంటే దెయ్యంగా మారాలా? సినిమా అనేది సృజనాత్మకతకు సంబంధించిన విషయం. దానికి, వ్యక్తిగత నమ్మకాలకు లింక్ పెట్టడం అవివేకం” అని కొట్టిపారేశారు.

ఆర్జీవీ తన మార్క్ వ్యంగ్యాన్ని జోడిస్తూ.. “నిజం చెప్పాలంటే దేవుడిని నమ్ముతూ, నిత్యం పూజలు చేసే వారి కంటే.. నాస్తికుడైన రాజమౌళికే దేవుడు ఎక్కువ విజయాలను, సంపదను ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే దేవుడికి నాస్తికులంటేనే ఎక్కువ ఇష్టమేమో? లేదంటే.. ఎవరు తనను నమ్ముతున్నారు, ఎవరు నమ్మడం లేదు అని లెక్కలు రాసుకునేంత ఖాళీ దేవుడికి లేదేమో?” అని చురకలంటించారు.

చివరగా విమర్శకులపై విరుచుకుపడుతూ.. “రాజమౌళితో దేవుడికే లేని సమస్య మీకెందుకు? అసలు సమస్య ఆయన నాస్తికత్వం కాదు.. దేవుడిని నమ్మకుండానే ఆయన అంతటి విజయం సాధించడమే మీ కడుపు మంటకు కారణం. మీరు దేవుడిని కాపాడాల్సిన అవసరం లేదు. దేవుడు బాగానే ఉన్నాడు, రాజమౌళి కూడా బాగానే ఉన్నాడు. రాజమౌళి తన తదుపరి చిత్రం ‘వారణాసి’తో దేవుడి దయవల్ల తన బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఇంకా పెంచుకుంటారు. అనవసరంగా ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు.. జై హనుమాన్” అంటూ ఆర్జీవీ తన ట్వీట్‌ను ముగించారు.


Spread the love
Tags: Constitution Article 25Rajamouli AtheismRajamouli ControversRajamouli Next Movie VaranasiRam Gopal Varma TweetsRGV Counterఆర్జీవీ కౌంటర్రాజమౌళి కొత్త సినిమా వారణాసిరాజమౌళి నాస్తికత్వంరాజమౌళి వివాదంరాజ్యాంగం ఆర్టికల్ 25రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.