Ramadan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సత్య, నిష్ఠ ,ధర్మాచరణ, దానధర్మాలతో ,ఉపవాస దీక్షలతో, పవిత్రంగా రంజాన్ మాసం ముగిసిందని. ఈద్-ఉల్-ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలతో ముస్లింల ఇల్లులన్నీ ఆధ్యాత్మికతతో నిండిపోతాయని, ఖురాన్ బోధించినట్టుగా మానవత్వ విలువలు, హితవచనాలు చాటిచెబుతూ, మానవుల మధ్య సోదర భావాన్ని నింపుతాయని, భారతదేశంలో రంజాన్ పండుగ నాడు మతసామరస్యం వెలువరిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కుల ,మతాల కు అతీతంగా ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాటు ఇతర మతస్తులు కూడా పాల్గొనడం ఒక మన భారతదేశంలోనే సాధ్యమని, ప్రపంచం మొత్తం శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని నా తరపున ఇస్లాంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసారు.
ఇప్పటికే రంజాన్ పండుగ సంబరాలు దేశమంతటా మొదలయ్యాయి. 30 రోజులుగా నిష్ఠతో ఉన్న ఉపవాసాలు విరమించుకోనున్నారు. ప్రతి ఇంటిలో సంతోష సంబరాలు వెలివిరుస్తున్నాయి. రేపటి రంజాన్ ని ప్రతి ఒక్క ముస్లిం సోదరీ, సోదరీమణులు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు.