Ramzan Festival :నేటి నుండే రంజాన్… నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు షురూ
ముస్లిం సోదరులకు రంజాన్ మొదలైంది. నెలవంక దర్శనం ఇవ్వడంతో రంజాన్ మాసం ప్రారంభం అయినట్టు సైరన్ మోగించి మరీ ఇస్లాం మత గురువులు ప్రకటించారు. దీనితో ఈ తెల్లవారుజామున సహార్ తో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.కాగా గత మూడేళ్ళుగా కరోనాతో రాష్ట్రంలో రంజాన్ సందడి పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్ కళ మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయింది
ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ.. మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాల కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. హైదరాబాద్ లోని ప్రముఖ నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం లు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్లు రెడీ అయ్యాయి.వ్యాపార సంస్థలను రంగు రంగుల విధ్యుత్ దీపాలతో అలంకరించారు.