Ranbir Kapoor Alia Bhatt : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్.. అన్యోన్యతను చూస్తే అందరికి తెగ ముచ్చటేస్తోంది. దీంతో వీరిద్దరికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తల్లి పమేలా చోప్రా ఏప్రిల్ 21( శుక్రవారం)న కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబీకులను పరామర్శించేందుకు
ఆదిత్య చోప్రా ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే అలియా భట్ రణబీర్ దంపతులు కూడా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో అలియా భట్ నార్మల్ వేర్ ధరించి చాలా సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో అలియా భట్ ముందుగా ఆదిత్య చోప్రా ఇంటిలోకి వెళ్లారు. అయితే ఆమె గుమ్మం బయట చెప్పులు వదిలి వెళ్ళగా వెనకే వెళుతున్నటువంటి రణబీర్
ఆ చెప్పులను చేతిలో పట్టుకొని పక్కన పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ట్రోలింగ్‌కు కారణం ఏంటంటే.. రణ్‌బీర్ ఆ చెప్పులను ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు పెట్టడమే. భార్య చెప్పులు మోయడం తప్పుకాదు.. కానీ వాటిని గుడిముందు పెట్టడం ఏంటి? అలియా ఆలోచించే ఆ చెప్పులను మెట్ల ముందు వదిలింది. కానీ రణ్‌బీర్ మాత్రం తెలివితక్కువ పని చేశాడు. పైగా అతను చెప్పులతో లోపలికి వెళ్లాడు’ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
https://www.instagram.com/reel/CrTbLC9sgUp/?igshid=YmMyMTA2M2Y=
Discussion about this post