Reasons for the Defeat of BRS in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి చాలా అంశాలు పరిగణలోనికి తీసుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ పరిపాలనలో చాలామంది పార్టీలో ఉన్న వారికే లాభం చేకూరిందని విమర్శలు వచ్చాయి. గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు చాలావరకు ఆ పార్టీలో ఉన్న వాళ్లకే, పార్టీకి అనుగుణంగా తిరిగే వాళ్లకే పరిమితమయ్యాయి అని, సామాన్య ప్రజానీకం వరకు పథకాలు చేరలేదు అనేది ముఖ్యమైన విమర్శ.
బీసీ బందు, దళిత బంధు, రైతుబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశారు. అవి ప్రజానీకానికి సక్రమంగా అందకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజానీకానికి పూర్తి వ్యతిరేకత వచ్చిందని చెప్పవచ్చు. మరో రకంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడం కూడా తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచడానికి మరో కారణం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజల్లో మమేకమై ఎలాగైనా సరే తెలంగాణలో గెలుపొందాలని దృఢ నిశ్చయంతో, ప్రతి నియోజకవర్గంలో శ్రమకు మించిన ప్రచారం చేశారు.

ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులందరిని సమన్వయ పరచడము, వారి మధ్యలో ఉన్నటువంటి చిన్న, చిన్న అపోహలు ,గొడవలను తొలగించి ఐకమత్యంగా వారిని ప్రచారంలో, బరిలో దించడానికి రేవంత్ రెడ్డి చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ పాత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన భూమిక అయింది. దాంతోపాటు బిజెపి మరియు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లోకి రావడం కూడా ఇక్కడ కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు.
ఒకవైపు కర్ణాటకలో 5 గ్యారెంటీలతో పార్టీ ఏర్పాటు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారెంటీ ల పేరుతో ముందుకు వచ్చింది. ఈ ఆరు గారెంటీలు ప్రజల్లోకి చాలా చొచ్చుకు వెళ్లాయి. వారు కాంగ్రెస్ నమ్మి ఓటెయ్యడానికి ప్రధాన కారణాలు ఈ 6 గ్యారంటీలు.
అలాగే బీఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కూడా ఏ ఒక్క సామాన్యుడికి, పేద ప్రజనికి అందలేదు. దానివల్ల కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులే లబ్ధి పొందారు. ఈ విషయంలో కూడా ప్రజలు పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పథకాన్ని తీసుకువచ్చారు. వాస్తవానికి అప్పుడు ఆ పథకం చాలా బాగా అమలు జరిగింది.
అందరికీ ఇల్లను కూడా కట్టించింది. పల్లె, పల్లెనా ఇందిరమ్మ ఇల్లు వెలిసాయి. కానీ బిఆర్ఎస్ నేతృత్వంలో వచ్చినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కళా సహకారం మాత్రం కాలేదు. ఇకపోతే మరో అతి ముఖ్యమైన విషయము కాంగ్రెస్ పార్టీ కొరకు గ్రామస్థాయి, కార్యకర్త నుంచి మొదలుపెడితే ఢిల్లీ స్థాయి నాయకత్వం వరకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేశారు.
ఇది కాంగ్రెస్ కి బాగా కలిసి వచ్చిన విషయం. అలాగే బీఆర్ఎస్, బిజెపి రెండు ఒకటే అనే భావన ప్రజలలో కలిగింది. దాని వల్ల కూడా ప్రజలు బి ఆర్ ఎస్ ని నమ్మలేదు. తమ ఓట్లను వేయలేదు. ఇప్పటికైనా మార్పుతో తమ కష్టాలు తొలగిపోతాయని కాంగ్రెస్ వస్తేనే అది సాధ్యమవుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసించారు. దాని ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపును రుచి చూసింది.
