Red Banana : పండ్లు ఆరోగ్యానికి ఎంత అవసరమో, ఎంత మంచివో మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది. మనం తీసుకునే రోజువారి ఆహారంలో పండ్లు ఉండేలాగా చూసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాంటి పండల్లాల్లో అరటిపండు ముఖ్య స్థానంలో ఉంటుంది.
అరటిపండును చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనకు ఆ విషయం తెలిసిందే, కానీ ఎర్రటి అరటిపండ్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయని మీరు ఎప్పుడైనా విన్నారా.. ఎర్రటి అరటిపండ్లు పేరు కొత్తగా వినే వాళ్ళకి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఈ అరటిపండ్ల వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు తెలుసుకుంటే మాత్రం వాటిని తినకుండా ఉండలేరు.
ఎర్రటి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎర్రటి అరటిపండ్లను తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ పండ్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఎర్రటి అరటిపండ్లలో ఉండే విటమిన్ సి, బి6 రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. చిన్న ఎర్ర అరటిపండు 9 నుంచి 28 శాతం వరకు విటమిన్ సి, బి6 కలిగివుంటుంది. ఎర్ర అరటిపండులో ఉండే పొటాషియం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు నివారింపబడతాయి.
అలాగే ఎర్రటి అరటిపండు తినడం వల్ల రక్తం శుభ్రపడడమే కాక, ఈ అరటిపండు బరువు తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. ఈ అరటి పండ్లలో ఉండే లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదం చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఎర్రటి అరటిపండు జాడను కనుక్కొని మీరు తినేయండి. దాంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.