Healthy Relationship Tips : మీ క్రష్ దృష్టిని ఆకర్షించడం అంత సులభం కాదు. ప్రేమించిన వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి తిప్పులు పడుతూ ఉంటారు. అయితే… ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
1.విశ్వాసం:
విశ్వాసం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మిమ్మల్ని మరింత చేరువయ్యేలా చేస్తుంది. అయితే, మీరు మితిమీరిన దూకుడు లేదా అహంకారంగా ఉండకూడదు. ప్రశాంతంగా, మీపై మీకు ఎక్కువ విశ్వాసం కనపరిచేలా ఉండాలి.
2.ఆసక్తి చూపండి:
మీ క్రష్ జీవితం, ఆసక్తుల గురించి ప్రశ్నలు అడగండి. వారి ప్రతిస్పందనలను చురుకుగా వినండి. వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఎంత ఉందో ఇది చూపిస్తుంది. మీరు వారి ఆలోచనలు, భావాలకు విలువ ఇస్తున్నారని కూడా ఇది చూపిస్తుంది.
Also Read: మీ పార్ట్ నర్ తో సంతోషంగా లేరు అనడానికి సంకేతాలు ఇవే…!
3.వారి బాడీ లాంగ్వేజ్ చాలా కీలకం:
మీరు ఒకరి చర్యలను అనుకరించినప్పుడు, మీరు వారిని గౌరవిస్తారని, ఇష్టపడుతున్నారని చూపిస్తుంది.
4. అభినందనలు:
ఒకరి దృష్టిని ఆకర్షించడంలో అభినందనలు ఒక శక్తివంతమైన సాధనం. కానీ మీ పొగడ్తలు తెలివిగా ఉండాలి. మీ మాటల్లో ఆప్యాయత, ప్రేమను కురిపించండి.
5.జోకులు:
హాస్యం ఎవరితోనైనా కనెక్ట్ అవ్వడానికి, వారికి సుఖంగా ఉండటానికి గొప్ప మార్గం. తమాషా జోకులు పేల్చడం ద్వారా వాతావరణాన్ని తేలికగా చేయగల వారి చుట్టూ ఉండటానికి అందరూ ఇష్టపడతారు.