ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ మధ్య జరుగుతున్న యుద్దం లోకి తెలంగాణ లోని ఖమ్మం మహిళా నేత వచ్చారు. కొడాలి నాని ని ఎడా పెడా ఉతికారేసిన మహిళా నేత. వీలు కుదిరినప్పుడల్లా గుడివాడ నా అడ్డా అని చెపుకుంటున్న నాని సంగతి గుడివాడలోనే చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకి దారితీస్తుంది.
ఇంతకీ ఆమహిళా నేత ఎవరో కాదు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే గుడివాడలో పోటీ చేస్తానని నాని సంగతి ఏంటో గుడివాడలో నే తేలుస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేసారు ఆమె. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే గుడివాడలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు బాగా ఉన్నాయి అదే టైం లో రేణుకా చౌదరిది కూడా కమ్మ సామాజిక వర్గమే.
నాకు గుడివాడలో బాగా తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నారు అలాగే గుడివాడలో పోటీ చేయాలంట ఆహ్వానాలు కూడా వస్తున్నాయి. గుడివాడలోనే పోటీ చేసి కొడాలి నానిని ఓడించి నాని తిక్కని దించుతానని అంటున్నారు రేణుకా చౌదరి.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం రేణుకా చౌదరి విశాఖపట్నంలో జన్మించారు. హైదరాబాద్ లో రాజకీయం మొదలెట్టి బంజారాహిల్స్ కార్పొరేటర్ గా గెలిచి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆతర్వాత టీడీపీలో కీలక నేతగా పైర్ బ్రాండ్ లీడర్ గా ఆమె దూకుడుగా వెళ్లేవారు. ఆ దూకుడు వల్లే ఎన్టీఆర్ తో విభేదాలు వచ్చాయి. అదే దూకుడు తో ఎన్టీఆర్ ను కూడా సవాల్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే లోక్సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్ లేని రేణుకా చౌదరి సడెన్ గా ఏపీ రాజకీయాలపై ఆమె హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇదేక్రమంలో అమరావతికి మద్దతుగా అక్కడి రైతులు అరసవెల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న రేణుకా చౌదరి ఏపీ సీఎం జగన్ పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు కనీసం పాలన చేతకాదని అధికాకరం నుంచి దిగిపోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని లేదంటే జగన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు రేణుకా చౌదరి.
జగన్ పై చేసిన కామెంట్లకు రేణుకా కి సమాధానం చెప్పే క్రమంలో ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా ఏపీకి వచ్చి జగన్ ను ఓడిస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు కొడాలి నాని.
దాంతో కొడాలి నాని, రేణుకా చౌదరి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. కొడాలి నానికి తన సంగతి తెలియదని, ఖమ్మం వస్తే చూపిస్తానని సవాల్ చేశారు. ఖమ్మం దాక ఎందుకు నేనే గుడివాడలో పోటీ చేసి తన బలం ఏంటో చూపిస్తానంటూ కొంచం తీవ్రం గానే మాట్లాడారు రేణుక.
ఇంతకీ రేణుక గుడివాడలో నిజంగానే పోటీ చేయబోతున్నారా? ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందని, ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న ఆటా అన్న చర్చ జనాల్లో సాగుతోంది.