Republic day 2023: దేశం మరికొన్ని గంటల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఇప్పటికే గణతంత్ర వేడుకలకు దేశం ముస్తాబవుతోంది. శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను దేశం జరుపుకుంటుంది. ఇక గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు భారత రాష్ట్రపతి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.


















