Revanth Reddy as the new Chief Minister of Telangana : ఎట్టకేలకు అందరి కోరికను నిజం చేస్తూ తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు కాంగ్రెస్ అధిష్టానం. మొదటినుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీఎం రేవంత్ రెడ్డి ఉండాలని పట్టుపట్టారు.రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ ఎన్నో ఉత్కంఠల మధ్య సీఎంగా రేవంత్ రెడ్డిగా ఖరారు చేశారు.
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ధ్రువీకరించి అధికారికంగా ప్రకటనను జారీ చేశారు. నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నో బుజ్జగింపులు నడుమ చాలా చర్చల అనంతరం సీఎంని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తము కోరుకున్నట్టుగానే రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా నిర్ణయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది అందరిలో సంబరాలు మిన్నంటాయి.

అలాగే మిగతా మంత్రి వర్గాన్ని కూడా ఎన్నుకొని కీలక అధికార ప్రకటన జారీ చేస్తామని చెప్పారు. హోం మంత్రిగా ఎవరుంటారు, ఐటి శాఖ మంత్రిగా ఎవరు ఉంటారనేది ఇప్పుడు ప్రజలలో ఉన్నటువంటి ఉత్కంఠ. చూడాలి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఏ పదవిని కట్టబెడుతుందో మరి.
