Revanth Reddy is Serious about Drugs : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి క్షణం నుంచే తన పనిని ప్రారంభించారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల సమస్యలు వింటూ, ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నిర్ణయాలను కొన్ని వ్యవహారాలపై కూడా ఆయన దృష్టి సారించారు.
ఇప్పుడు వాటిపై విచారణ చేయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతిని, అక్రమాలను బయటకు తీయాలని నిర్ణయించుకుని అటువైపుగా అడుగులు వేస్తున్నారు. డ్రగ్స్ దందా తెలంగాణలో కొన్ని సందర్భాలలో వినిపించింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు విచారణలో కూడా పాల్గొన్నారు.
ఈ విషయం మీద కూడా రేవంత్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో డ్రెగ్స్ ని పెరగనివ్వము, వాటిని అదుపులో ఉంచుతాము, వాటి నిర్మూలిస్తామని ఆలోచనలు సాగుతున్నాయి. అయితే టాలీవుడ్ లో డ్రగ్స్ విషయం అప్పుడొక కుదుపు కుదిపేసిన విషయం మనందరికీ తెలిసిందే, టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది ఈ దందాలో ఉన్నట్టు కూడా చాలా ప్రచారం జరిగింది.
హీరోలు, ప్రముఖ ఆర్టిస్టులు కూడా విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రముఖులంతా బీఆర్ఎస్ కీలక నాయకులతో సన్నిహితంగా మెలగడం ఆ పార్టీకి మద్దతు పలకడం కూడా చాలా చోట్ల జరిగాయి. గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు డ్రగ్స్ విషయం గురించి చాలా పోరాటమే చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.
ఈ విషయం పట్ల సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా టాలీవుడ్ తీరుపై కొత్తగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీరియస్ గానే ఉన్నారు. తను బాధ్యత చేపట్టిన తర్వాత టాలీవుడ్ నుంచి తనకి ఎవరు ఫోన్ చేయలేదని, ఒక్క దిల్ రాజు మాత్రమే ఫోన్ చేశారని, ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి సీరియస్ గా ఉండడం, ఈ పరిణామాలతో సినీ ప్రముఖులంతా రేవంత్ తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసే ఆలోచన ఉన్నట్లుగా కీలకమైన సమాచారం బయటకు వచ్చింది.