Revanth Reddy Tweet : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ తన సత్తా చాటుతుంది. బీఆర్ఎస్ ని ఘోరంగా వెనకంజలో పడేసింది. ఇప్పటికే కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు సంబరాలలో మునిగితేలారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనడానికి ఇప్పుడు కాంగ్రెస్ విజయం ఒక సంకేతంగా చెప్పవచ్చు. ఈ నేపద్యంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలమైన ట్వీట్ చేశారు.
ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ అధిపత్యంలో ఉంది. తెలంగాణలో తొలి ఫలితాలు కూడా వెళ్లడాయ్యాయి. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. 28,358 ఓట్లతో ఆదినారాయణ గెలిచారు. ఇల్లందు లోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. ఈ సంబరాల్లోనే రేవంత్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని రేపుతుంది.
“అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది” అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు చాలా ఆసక్తిని రేకెత్తించింది. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరుడైన వ్యక్తి. అతడి వర్ధంతి రోజే బిఆర్ఎస్ గద్దె దిగడం ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు తీరుస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.